బిడ్డను చూడకుండానే కో పైలట్ మృతి

కొలికోడ్‌: కొద్ది రోజుల్లో తండ్రిని కాబోతున్న ఆనందంలో ఉన్నా..విధి నిర్వహణకే ప్రాముఖ్యత ఇచ్చి నిండు గర్భిణి అయిన భార్యను ఇంటి వద్దే ఉంచి విధులకు బయలుదేరాడు. కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకువచ్చి, వారిని కుటుంబ సభ్యులతో కలపడమే ముఖ్యమనుకున్నాడు. కానీ, విధి మాత్రం ఆయన మీద అంత జాలి చూపించలేదు. దాంతో తాను ఇష్టంగా చేస్తోన్న ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే  ప్రాణాలు కోల్పోయాడు. అతడే ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ కోపైలట్ అఖిలేశ్‌ శర్మ. 

స్నేహితులు, బంధువులతో అఖిల్ అని ప్రేమగా పిలిపించుకొనే అఖిలేశ్ శర్మకు తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు తమ్ముళ్లు, సోదరి ఉన్న అందమైన కుటుంబం ఉంది. కరోనా కారణంగా  లాక్‌డౌన్‌కు ముందు ఒకసారి మాత్రమే కుటుంబాన్ని కలుసుకున్నాడు. ఆయనకు 2017లో వివాహం జరగ్గా..ఇప్పుడు ఆయన భార్య మేఘ నిండు గర్భిణి. మరికొన్ని రోజుల్లో వాళ్లింటికి పండంటి బిడ్డ రాబోతుంది. కానీ, ఇప్పుడు కుటుంబానికి పెద్ద దిక్కు అయిన అఖిలేశ్‌ మాత్రం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయాడు. అత్యంత బాధాకర విషయం ఏంటంటే  ఇప్పటికీ ఆయన భార్యకు ఈ దుర్వార్తను కుటుంబసభ్యులు తెలియనివ్వలేదట. 

Read Full Article Here

Continue Reading

మేమే చంపాం.. వచ్చి అరెస్టు చేయండి

బల్లార్ష, న్యూస్‌టుడే : మహారాష్ట్ర చంద్రపూర్‌ జిల్లా బల్లార్‌పూర్‌ పట్టణంలో సూరజ్‌ బహురియా(30) అనే యువకునిపై ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. అనంతరం పోలీసులకు ఫోన్‌ చేసి మేమే చంపాం.. వచ్చి అరెస్టు చేయండని సమాచారం సైతం ఇచ్చారు. ఈ ఘటన శనివారం బల్లార్‌పూర్‌ పట్టణంలోని పాత బస్టాండ్‌ ప్రధాన రహదారిపై జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలో బొగ్గు వ్యాపారం చేస్తున్న సూరజ్‌ బహురియా తన కారులో బామినీ వైపు వెళుతూ పాత బస్టాండ్‌ వద్ద ఓ హోటల్‌ ఎదుట ఆగాడు. అంతలో వెనుకనుంచి ఇద్దరు దుండగులు వచ్చి డ్రైవర్‌ సీటులో కూర్చున్న బహురియాను కారుగ్లాసు తీయమని కోరారు. గ్లాసు తీయకపోవడంతో దుండగులు తుపాకీతో కారు గ్లాసుపై కాల్పులు జరిపారు. అదే తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సుమారు ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో అతని తలపై తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు అతడిని చంద్రపూర్‌ జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కాల్పులు జరిపిన అనంతరం దుండగులు తమ ద్విచక్ర వాహనంపై బీటీఎస్‌ చౌక్‌కు చేరుకొని మేమే కాల్చి చంపాం. ఇక్కడే ఉన్నాం. వచ్చి అరెస్టు చేయండని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెళ్లి వారిని అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. విషయం తెలుసుకున్న సూరజ్‌ అనుచరులు పోలీస్‌ స్టేషన్‌ కూడలిలో గుమికూడి దుండగులను అప్పగించాలని ఆందోళన చేశారు. పోలీసులు వారందరిని చెదరగొట్టి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడలిలో జరిగిన కాల్పుల ఘటనతో బల్లార్‌పూర్‌ పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం సూరజ్‌ పుట్టిన రోజు సందర్భంగా పట్టణంలోని ప్రధాన రహదారిపై భారీ బ్యానర్లు కట్టారు. పాత కక్షలతోనే సూరజ్‌ను హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఉపవిభాగీయ అధికారి జాదవ్‌, ఠాణేదార్‌ భగత్‌ సందర్శించారు. అనంతరం జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి సందర్శించి వివరాలపై ఆరా తీశారు.

Read Full Article Here

Continue Reading

రైతులకు మోదీ శుభవార్త.. ఈరోజే ఖాతాల్లోకి రూ.17వేల కోట్లు!

నేటి నుంచి ప్రధాని మోదీ కిసాన్ సమ్మాన్ నిధి ఆరవ విడత కార్యక్రమం ప్రారంభం కానుంది. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమకానున్నాయి.

రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు అందిస్తోన్న విషయం తెలిసిందే. రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. కేంద్రం రైతుల కోసం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్ స్కీమ్)ను అందిస్తోంది. కేంద్రం పీఎం కిసాన్ స్కీమ్ కింద అర్హులైన రైతులకు రూ.6,000 అందిస్తోంది. మూడు విడతల్లో రూ.2,000 చొప్పున అన్నదాతలకు ఈ డబ్బులు అందుతాయి. మోదీ సర్కార్ పీఎం కిసాన్ స్కీమ్ కోసం ఏకంగా రూ.75 వేల కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.

రేపట్నుంచి ప్రధాని మోదీ కిసాన్ సమ్మాన్ నిధి ఆరవ విడతలో భాగంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేయనునున్నారు. ఆదివారం ఉదయం 11 గం. లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ప్రధాని కిసాన్ యోజన పథకం కింద 8.5 కోట్ల మంది రైతులు లబ్ధిదారులుగా మారనున్నారు. ఈ పథకం 6వ విడతగా రూ. 17,000 కోట్లు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా పిఎం కిసాన్ సమ్మన్ యోజన ఆరవ విడత 2000 రూపాయలను కూడా రైతుల ఖాతాకు బదిలీ చేయనున్నారు.

Read Full Article Here

Continue Reading

మందుబాబులకు గుడ్ న్యూస్, లిక్కర్ రేట్ తగ్గింపు.. 30 నుంచి 40 శాతం వరకు, కారణమిదేనా..?

మందుబాబులకు తీపికబురు. అవును మధ్యం ధరలను తగ్గిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇండికేషన్స్ ఇచ్చింది. ఆ ప్రకటనతోనే మందుబాబులు పండుగ చేసుకుంటున్నారు. మద్యం ధరలు అంతకుముందు మాములుగానే ఉండేవీ.. కానీ లాక్ డౌన్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు లిక్కర్‌పై ధర పెంచాయి. ఢిల్లీ 70 శాతం వరకు పెంచగా, తెలంగాణలో 16 శాతం పెంచారు. తెలంగాణలో తర్వాత తగ్గించబోమని సీఎం కేసీఆర్ అప్పుడే స్పష్టంచేశారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 75 శాతం వరకు పెంచారు. దీంతో సామాన్యులు మందు కొనలేని పరిస్థితి వచ్చింది.

శానిటైజర్ తాగి.. మత్తులోకి జారుతూ.. మందుబాబులు మద్యం కొనలేక శానిటైజర్ తాగుతూ మత్తులోకి జారుతున్నారు. ఇటీవల ఏపీలో భారీగా మరణాలు సంభవిస్తున్నాయి. ప్రకాశం జిల్లా కురిచేడులోనే పదుల సంఖ్యలో చనిపోయారు. చిత్తూరు జిల్లాలో కూడా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ప్రతిపక్షం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. శానిటైజర్ల విక్రయాలపై నియంత్రణ, మద్యం ధరల పెంపు ప్రభావం చూపిందన్నారు. విపక్షలు విమర్శలతో గుక్కతిప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. మద్యం ధరలను తగ్గించక తప్పదని భావించింది. లిక్కర్ రేట్లను తగ్గిస్తామని.. సంకేతాలు ఇచ్చింది.

Read more at: https://telugu.oneindia.com/news/andhra-pradesh/liquor-rate-will-be-decrease-in-30-to-40-per-in-ap/articlecontent-pf285175-274178.html

Continue Reading

రానా ఇంట పెళ్లి సందడి షురూ.. బాధగా ఉంది కానీ తప్పట్లేదు.. దగ్గుబాటి సురేష్ బాబు కామెంట్స్

రానా- మిహికా బజాజ్ ఈ రోజే (శుక్రవారం) మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల్లో సందడి వాతావరణం నెలకొంది. అయితే తాజాగా రానా పెళ్లి విషయమై స్పందించిన సురేష్ బాబు.. అంతా బాగానే ఉంది కానీ కేవలం ఒక్క విషయంలో బాధగా ఉందని చెప్పారు.

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఈ రోజే (ఆగస్టు 8) రానా- మిహికా వివాహ వేడుక జరగనుంది. వేదమంత్రాల నడుమ అత్యంత సన్నిహితుల మధ్య జరగనున్న ఘనంగా జరగనున్న ఈ వేడుకకు హైదరాబాద్ రామానాయుడు స్టూడియో వేదిక కానుంది. ఈ మేరకు రామానాయుడు స్టూడియోలో అన్ని సదుపాయాలతో పెళ్లి ఏర్పాట్లు, కళ్ళు చెదిరే డెకరేషన్ చేయించారట రానా తండ్రి సురేష్ బాబు.

మరోవైపు పెళ్లికి మూడు రోజుల ముందే (బుధవారం) ప్రారంభమైన ప్రి-వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌తో అటు రానా ఇంట, ఇటు రానాకు కాబోయే భార్య మిహికా బజాజ్ ఇంట సందడి వాతావరణం నెలకొంది. హల్దీ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్, పెళ్లి కొడుకును చేయడం లాంటి కార్యక్రమాలతో ఇరు కుటుంబాలు బిజీ అయ్యాయి. గురువారం మధ్యాహ్నం నుంచి పెళ్లి వేడుకలు ఊపందుకొన్నాయి. శుక్రవారం రాత్రి రానా-మిహీకా సంగీత్ కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ వేడుకలో అక్కినేని నాగచైతన్య, సమంత దంపతులు కూడా పాల్గొని సందడి చేశారట.

Read Full Article Here

Continue Reading

స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగానే ఉన్నాయి. ఈనెల ప్రారంభం నుంచి పెట్రోల్, డీజిల్ ధరల్లో పెద్దగా మార్పులు లేకుడా స్థిరంగా కొనసాగుతున్నాయి.

దేశీ ఇంధన ధరలు నిలకడగానే కొనసాగాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో గత కొన్ని రోజులుగా ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌‌లో బుధవారం ఇంధన ధరలు నిలకడగానే ఉన్నాయి. లీటరు పెట్రోల్ ధర రూ.83.49 వద్ద స్థిరంగానే ఉంది. డీజిల్ ధర కూడా రూ.80.14 వద్ద నిలకడగానే కొనసాగుతోంది.

అయితే ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.76.07గా ఉంది. డీజిల్‌ ధర కూడా రూ. 81.22గా ఉంది. అయితే తెలంగాణలో మాత్రం పెట్రోల్ రేటు… లీటర్‌కు రూ. 83.66గా ఉంది. డీజిల్ ధర రూ.80.14గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పు లేదు. పెట్రోల్ ధర రూ.80.43 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా స్థిరంగా రూ.73.56 వద్ద ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా ధరలు నిలకడగానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.87.19 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర రూ.80.43గా కొనసాగుతోంది.

Read Full Article Here

Continue Reading

ఉత్తమ జర్నలిస్టు, అత్యుత్తమ నాయకుడు

సమకాలీన సామాజిక పరిస్థితుల ప్రభావాలు మనుషులపై ఎంతటి ప్రభావాన్ని వేస్తాయి, వ్యక్తులను ఎలా తీర్చిదిద్దుతాయి అనేదానికి రామలింగారెడ్డి చక్కటి ఉదాహరణ. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఎనభయవ దశకంలో ఉవ్వెత్తున సాగిన రైతాంగ ఉద్యమాల ప్రభావం రామలింగారెడ్డిపై గణనీయంగా ఉన్నది. విద్యార్థి దశనుంచే ఆయన ఉద్యమంలో భాగస్వామి అయ్యాడు. దుబ్బాక జూనియర్‌ కళాశాల ఎన్నికల్లో విద్యార్థిసంఘం నేతగా ఎన్నికయ్యాడు. ఆ చైతన్యంతోనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సామాజిక సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేశాడు. మెదక్‌ జిల్లా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మూఢ నమ్మకాల నిర్మూలనకు, ముఖ్యంగా గోసంగి దురాచారానికి వ్యతిరేకంగా ఊరూరా ప్రజలను చైతన్యపరిచి పోరాటాలు నిర్మించాడు. అలాగే సారా అమ్మకాలకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రజలను, యువతను కూడగట్టి పోరాటాలు చేశాడు. తన సొంత గ్రామం చిట్టాపూర్‌ మొదలు పరిసర గ్రామాలే కాదు, జిల్లా వ్యాప్తంగా భగత్‌సింగ్‌ యువజన సంఘాలు నిర్మాణం చేసి యువతను చైతన్యపరిచాడు. ఓ జర్నలిస్టుగా తన చుట్టూరా సామాజిక ఘటనలను వెలుగులోకి తెస్తూ, వాటి సామాజిక ప్రభావాలను బాహ్య ప్రపంచానికి తెలియజేయటానికి ఆయన ఆహర్నిశలు పాటుపడ్డాడు. ఆ క్రమంలో ఆయన తీవ్ర నిర్బంధాలను ఎదుర్కో వాల్సిన పరిస్థితి ఏర్పడింది. జర్నలిస్టుగా ఉండి ఉద్యమకారులకు సహాయ సహకారాలు అందిస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులు రామలింగారెడ్డిని అనేక విధాలుగా వేధించారు, బెదిరించారు. ఒకానొక దశలో కాల్చివేస్తామని కూడా పోలీసులు ప్రకటించే దుస్థితి వచ్చింది. దాంతో రామలింగారెడ్డి ఓ జర్నలిస్టుగా ఉండి కూడా హైదరాబాద్‌లాంటి చోట్ల తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ క్రమంలోనే రామలింగారెడ్డిపై కక్షపెంచుకున్న పోలీసులు రాష్ట్రంలోనే మొట్ట మొదటిదిగా ‘టాడా’ కేసు నమోదు చేసిన నిర్బంధ చీకటి కాలమది. పోలీసుల వైపు నుంచి ఎన్ని విధాలుగా వేధింపులు ఎదురైనా మొక్కవోని దీక్షతో ఆయన నిత్య నిర్బంధాలను ఎదుర్కొంటూ ప్రజాపక్షపాతాన్ని వీడలేదు. జైలు నిర్బంధాలకు వెరువలేదు. 

Read Full Article Here

Continue Reading

శ్రేయ్ హాస్పిట‌ల్ సీజ్‌‌

అహ్మ‌దాబాద్‌: ఎనిమిది క‌రోనా రోగుల చావుకు కార‌ణ‌మైన గుజ‌రాత్ రాజ‌ధాని అహ్మ‌దాబాద్‌లోని శ్రేయ్ ద‌వాఖాన‌ను అధికారులు అధికారులు సీజ్ చేశారు. అందులో ఉన్న 41 మంది రోగుల‌ను స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్‌ప‌టేల్ ద‌వాఖాన‌కు త‌ర‌లించామ‌న‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ అద‌న‌పు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాజీవ్ కుమార్ గుప్తా ప్ర‌క‌టించారు.

అహ్మ‌దాబాద్‌లోని న‌వరంగ్‌పురాలో ఉన్న శ్రేయ్ ద‌వాఖాన‌లో ఈరోజు తెల్ల‌వారుజామున భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో ఎనిమిది మంది క‌రోనా రోగులు మృతిచెందారు. మ‌రో 35 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వారిని ఇత‌ర హాస్పిట‌ళ్ల‌కు త‌ర‌లించారు. ద‌వాఖాన‌లోని ఐసీయూలో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగ‌డంతో భారీ అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. 

ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని మోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.  గాయ‌ప‌డిన‌వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థించారు. ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన‌వారి కుటుంబాల‌కు రూ.2 ల‌క్ష‌ల చొప్పున‌, క్ష‌త‌గాత్రుల‌కు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్ర‌క‌టించారు. అదేవిధంగా ప్ర‌మాద ఘ‌ట‌న‌పై గుజ‌రాత్ సీఎం విజ‌య్ రూపానీ స్పందించారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తిస్థాయి విచార‌ణ జ‌రిపి మూడు రోజుల్లో నివేదిక అందించాల‌ని హోం మంత్రిత్వ శాఖ‌ను అదేశించారు. హోంశాఖ అడిష‌న‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ సంగీత సింగ్ ఆధ్వ‌ర్యంలో క‌మిటీని ఏర్పాటు చేశారు.

Read Full Article Here

Continue Reading

ప్రపంచానికి తొలి కరోనా వ్యాక్సిన్ హైదరాబాద్ నుంచే..: కేటీఆర్

KTR: భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా, తెలంగాణ లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మా డైర‌క్టర్ శ‌క్తి నాగ‌ప్పన్‌తో క‌లిసి మంత్రి కేటీఆర్ ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి తెలంగాణ నుంచే తొలి టీకా (వ్యాక్సిన్) వ‌స్తుంద‌ని మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. హైద‌రాబాద్‌కు చెందిన భార‌త్‌ బ‌యోటెక్ సంస్థ నుంచే ఆ టీకా వినియోగంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నట్లుగా ఆయ‌న వెల్లడించారు. హైద‌రాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో ఉన్న భార‌త్ బ‌యోటెక్ వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ మంగళవారం సందర్శించారు. మంత్రి కేటీఆర్‌ వెంట భారత్ బయోటెక్ అధినేత డాక్టర్ కృష్ణ ఎల్లా, ఆయన భార్య సుచిత్ర ఎల్లా కూడా ఉన్నారు. ఈ సందర్భంగా భార‌త్ బ‌యోటెక్ సంస్థ ఉద్యోగుల‌తో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

అనంతరం భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా, తెలంగాణ లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మా డైర‌క్టర్ శ‌క్తి నాగ‌ప్పన్‌తో క‌లిసి మంత్రి కేటీఆర్ ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ త‌యారీలో భార‌త్‌ బ‌యోటెక్ ముందంజలో ఉండ‌డం గ‌ర్వంగా ఉంద‌ని మంత్రి అన్నారు. క‌రోనాకు వ్యాక్సిన్ తొలుత హైద‌రాబాద్ నుంచే భార‌త్ బ‌యోటెక్ సంస్థ నుంచి రానుందని ఆయ‌న ఆశాభావం వ్యక్తం చేశారు.

Read Full Article Here

Continue Reading

అనురాగ బంధానికి అద్భుత రక్ష!

శ్రావణ పౌర్ణమినే ‘రాఖీపౌర్ణమి’గా జరుపుకొంటాం. ఇవాళ అక్కాచెల్లెండ్లు తమ సోదరులకు ప్రేమానురాగాలకు గుర్తుగా రక్షాబంధనాన్ని కట్టడం ఆనవాయితీ.

భారతీయ జీవన విధానంలో ఒక విశేషం ఉంది. మనమాచరించే ప్రతి కర్మా, పాటించే ఆచారం భౌతిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు నెరవేర్చే విధంగా ఉంటాయి. వైదికంగా ‘నభోమాసం‘గా పిలిచే శ్రావణమాసంలో శ్రవణా నక్షత్రంతో కూడిన పౌర్ణమి ‘శ్రావణ పౌర్ణమి’. దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇది శివకేశవులకూ వారి భార్యలు పార్వతీ, శ్రీలక్ష్మికీ, అలాగే ఇంద్రాణికీ ప్రీతిపాత్రమైందిగా భావిస్తారు. అందుకే, చాతుర్మాస్య దీక్షలో ఉన్నవారు, ఉపాసకులు ఈ నెలను ప్రశస్తమైందిగా భావిస్తారు. మంగళప్రదమైన మాసం కావడం వల్ల సౌభాగ్యాన్ని కోరుకుంటూ స్త్రీలు మంగళవారాలు, శుక్రవారాలు ప్రత్యేక నోములు నోచుకోవడం, వాయినాలు ఇచ్చుకోవడం ఆచారంగానూ వస్తున్నది.

Read more here

Continue Reading